ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ . కాశీకి ఎంపీ అయిన మోదీ.. దక్షిణ కాశీకి వస్తున్నారంటే గొప్ప ప్రకటన చేస్తారనుకునన్నారు. వేములవాడ ఆలయాన్ని తీర్చిదిద్దుతానని కూడా మోదీ చెప్పలేదన్నారు. ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ, కొండగట్టును చేర్చాలని తాను గతంలో కేంద్రాన్ని కోరినట్లుగా గుర్తుచేశారు.
వేములవాడ అభివృద్ధికి నిధులు కోరితే ఇవ్వలేదన్న వినోద్ కుమార్.. ఇవాళ మోదీ హామీ ఇస్తారని ఆశించానన్నారు. వేములవాడ అభివృద్ధి గురించి బండి సంజయ్ ఎందుకు పట్టించుకోవట్లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని నిలదీశారు.