మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? అని సందేహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. విభజన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఏ భరోసా ఇవ్వలేదని.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలనే నెరవేర్చలేదని ఆరోపించారు.
Also Read :- ప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్
తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని.. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు రేవంత్రెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఓట్లను చీల్చీ బీఆర్ఎస్ గెలిపించేందుకు బీజేపీ యత్నస్తుందని రేవంత్రెడ్డి విమర్శించారు.