Modi America Tour: ముంబై పేలుళ్ల కుట్రదారు అప్పగింత ట్రంప్ ఆమోదం

Modi America Tour: ముంబై పేలుళ్ల కుట్రదారు అప్పగింత ట్రంప్ ఆమోదం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వైట్ హౌజ్ లో అధ్యక్షుడు ట్రంప్ ను కలిశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను  ప్రధాని తొలిసారి కలిశా రు. వైట్ హౌజ్ లో ప్రధాని మోదీకి హగ్ తో స్వాగతం పలికారు ట్రంప్. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై డీల్స్ కుదుర్చు కు న్నారు. 26/11 కుట్రదారుడు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపారు.

మోడీ అమెరికా పర్యటనలో కీలక అంశాలు, ఒప్పందాలు .. 

  • చమురు, టెక్నాలజీన, కనెక్టిటివిటీ లో పరస్పర సహకారంపై ఒప్పందం 
  • భారత్ కు ఆయుధాల సరఫరా పెంచేందుకు ట్రంప్ ఆమోదం.. F35 స్టెల్త్ ఫైటర్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ 
  • భారత్ కు చమురు, గ్యాస్ సరఫరాకు ఒప్పందం 
  • ఇస్లామిక్ ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సహకారం
  • భవిష్యత్తులో  ప్రత్యేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించనున్నట్లు ట్రంప్ ప్రకటన 
  • 2033 నాటికి భారత్, అమెరికా 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యానికి ఇరు దేశాల సహకారం