
ప్రస్తుతం దేశంలో జరిగే ఎన్నికలు దేశ ప్రధాని కోసమని, దేశాన్ని కాపాడేవారికే మీ అమూల్యమైన ఓటు వేయాలని బీజేపీ నేత బాబుమోహన్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ లోని మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ సమర్థుడని, దేశానికి ఆయన అవసరం ఉందని అన్నారు. కాబట్టి దేశ ప్రజలంతా తమ ఓటును నరేంద్ర మోడీకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
మోడీ ప్రధాని అయిన తర్వాతే శత్రు దేశం పాకిస్తాన్ ను ఏకాకిని చేశారని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెలలో మన సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా.. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి 400 మంది పాక్ ఉగ్రవాదులను హతం చేశారని బాబు మోహన్ అన్నారు. దేశంలో పటిష్ట భద్రతకు మోడీ పలు చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.