ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని మోదీ ప్రయత్నిస్తున్నరు: డి.రాజా

ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని మోదీ ప్రయత్నిస్తున్నరు: డి.రాజా

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి,  నియంతృత్వ వ్యవస్థను  తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల ద్వారా  బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. లౌకిక పార్టీలు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల సీపీఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు అమలు చేయనున్న వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నెల 4న హైదరాబాద్​లో నిర్వహించనున్న ‘పాలస్తీనా సంఘీభావ సభ’కు సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.