జగిత్యాల సభలో మోదీ అబద్దాలు : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

 రాయికల్​, వెలుగు : కేంద్రంలోని ఎన్​డీఏ సర్కార్​ హయాంలో ఎక్కువగా రైతులు, యువకులు, రైతు కూలీలే నష్టపోయారని, కేంద్రం పేదలను దోచి బడా వ్యాపారవేత్తలకు పంచి పెడుతోందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్​లో బుధవారం మాట్లాడుతూ జగిత్యాల సభలో ప్రధానమంత్రి మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే షుగర్ ​ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారని, అప్పుడున్న మెట్​పల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ విద్యాసాగర్​రావు పట్టించుకోలేదన్నారు. పసుపు రైతులకు ఇప్పటికైనా బోర్డు ఏర్పాటుపై స్పష్టతనివ్వాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు. నిజామాబాద్​లోక్​సభ అభ్యర్థి విషయంలో చర్చలు జరుగుతున్నాయని, తాను పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు హైకమాండ్​దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.