బడ్జెట్ కోసం ఆర్థిక వేత్తలు, నిపుణులతో మోదీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం దేశంలోని ప్రముఖ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నిపుణుల సలహాలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోనున్నారు.  వీరితో సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  2024–25 ఆర్తిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 23 న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వివిధ సెక్టార్లలోని నిపుణులు, ఆర్థిక వేత్తలతో పాటు నీతి ఆయోగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమన్ బేరి ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నారు. 

ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లానింగ్ మినిస్టర్ రావు ఇంద్రజిత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చీఫ్ ఎకనామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్, ఆర్థిక వేత్తలు సుర్జిత్ బెల్లా, అశోక్ గులాటి, సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నారు.