- భారత్, యూఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: ఇంధన సహకారాన్ని విస్తరించేందుకు భారత్, యూఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు జరిగాయి. ఎల్ఎన్జీ సరఫరాతోపాటు బరాక్న్యూక్లియర్పవర్ప్లాంట్నిర్వహణ సహా మరో 2 ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాల్ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు వచ్చారు.
మవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గాజాలో ప్రస్తుత పరిస్థితి సహా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై వారి మధ్య డిస్కషన్ జరిగినట్టు తెలిపింది. కాగా, మోదీతో చర్చలు జరిపిన అనంతరం అబుదాబి క్రౌన్‌ప్రిన్స్.. రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
ఎల్ఎన్జీ సరఫరాకు ఎంఓయూ
సుదీర్ఘకాలంపాటు లిక్విఫైడ్ నేచురల్గ్యాస్(ఎల్ఎన్జీ) సరఫరా కోసం అబుదాబి నేషనల్ఆయిల్కంపెనీ (ఏడీఎన్ఓసీ), ఇండియన్ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఏడీఎన్ఓసీతో స్ట్రాటజిక్పెట్రోలియం రిజర్వ్లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మరో అగ్రిమెంట్ చేసుకున్నాయి.
అలాగే, యూఏఈ మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్అయిన బరాక్ నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం జరిగినట్టు ఎంఈఏ పేర్కొన్నది.
ఉర్జా భారత్, ఏడీఎన్ఓసీ మధ్య అబుదాబి ఆన్‌షోర్ బ్లాక్ వన్‌కు సంబంధించి ఉత్పత్తి రాయితీ కోసం నాలుగో అగ్రిమెంట్ జరిగినట్టు వెల్లడించింది. భారత్‌లో ఫుడ్ పార్కుల ఏర్పాటుకు అబుదాబి డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ, గుజరాత్ సర్కారు మధ్య మరో ఒప్పందం చేసుకున్నట్టు ఎంఈఏ వెల్లడించింది.