తెలుగులో మోడీ ట్వీట్: నేడు జరిగే సభలకు రావాలని పిలుపు

తెలుగులో మోడీ ట్వీట్: నేడు జరిగే సభలకు రావాలని పిలుపు

తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు మోడీ బహిరంగ సభలు జరుగనున్నాయి. మహబూబ్ నగర్, కర్నూలు లో జరిగే బహిరంగ సభలకు భారీగా యువత రావాలని ట్విటర్ ద్వారా కోరారు మోడీ. ఇందుకు తెలుగులోనే ట్వీట్ చేశారు.  ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరంగా చెప్పదలచుకున్నానని మోడీ తెలిపారు. భారత ప్రజలంతా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు ఆశీర్వదించాలో కూడా వివరిస్తానని అన్నారు.

కర్నూల్ ర్యాలీ గురించి ట్విటర్ లో ప్రస్తావించిన మోడీ.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అవినీతిలో కూరుకు పోయిందని అన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిరోగమనం పాలు చేశారని తెలిపారు.