పిరికిపంద చర్య.. న్యూ ఓర్లీన్స్ ఉగ్రదాడి ఘటనపై స్పందించిన మోడీ

పిరికిపంద చర్య.. న్యూ ఓర్లీన్స్ ఉగ్రదాడి ఘటనపై స్పందించిన మోడీ

న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌‎లో జరిగిన ఉగ్ర దాడిపై భారత ప్రధాని మోడీ స్పందించారు. ఈ టెర్రర్ ఎటాక్‎ను పిరికిపంద చర్యగా మోడీ అభివర్ణించారు. ఈ మేరకు గురువారం (జనవరి 2) ఎక్స్ (ట్వి్ట్టర్) వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘‘న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం. ఈ విషాదం నుండి బాధితులు త్వరగా కోలుకోవాలి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా’’ అని మోడీ ట్వీట్‎లో పేర్కొన్నారు. 

కాగా, 2025, జనవరి 1వ తేదీన న్యూ ఓర్లీన్స్‌ నగరంలో షంసుద్-దిన్ జబ్బార్ అనే వ్యక్తి జనసమూహంపైకి ట్రక్‎తో దూసుకెళ్లాడు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. నిందితుడిని స్పాట్‎లోనే కాల్చి చంపేశాయి. షంసుద్-దిన్ జబ్బార్ ఉపయోగించిన వాహనంపై ఉగ్రవాద గ్రూప్ ఐఎస్ ఐఎస్ గుర్తులు ఉన్నట్లు ఎఫ్‎బీఐ గుర్తించింది. తద్వారా ఇది టెర్రర్ ఎటాక్ అని ఎఫ్‎బీఐ పేర్కొంది.