- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర తీర్మానాలు ప్రతి పౌరుడి జీవితాన్ని నాశనం చేసే జుమ్లాలకు తక్కువేమీ కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం లేదని, ప్రజల జీవితాల్లో గందరగోళాన్ని ఈ ఏడు సూచికలు తెలియజేస్తున్నాయని గురువారం ఆయన ట్వీట్ చేశారు.‘‘గోల్డ్ లోన్‌లు 50 శాతం, గోల్డ్ లోన్ ఎన్‌పీఏలు 30 శాతం పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 7.1 శాతంగా నమోదైంది. ” అని ఖర్గే పేర్కొన్నారు.