ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుంది: మోదీ

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్లు భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  ఇలాంటి బాధాకర పరిస్థితుల్లో ఇండియా ఇరాన్ కు అండగా నిలుస్తోందని మోదీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్-అబ్దుల్లాహియాన్, ఇతర ఉన్నతాధికారుల మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. 

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ అకస్మిక విషాద మరణం పట్ల ఇండియా ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్, -ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నరేంద్ర మోదీ హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఇలాంటి  పరిస్థితుల్లో ఇండియా ఇరాన్ కు అండగా ఉంటుందని మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ రాశారు.

ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఈ ఏడాది జనవరిలో రైసీ, అబ్డోల్లాహియాన్‌లతో తన చివరి సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రజలతో న్యూ ఢిల్లీ నిలబడి ఉంటుందని పేర్కొన్నారు.