ప్రధాని మోదీ ఆరోజు ( ఫిబ్రవరి 13) సాయంత్రం 4గంటలకు UAE పర్యటనకు బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లో ఉండనున్నారు. రేపు (ఫిబ్రవరి 14)న అబుదాబీలో నిర్మించిన తొలి హిందు ఆలయం BAPS మంధిర్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారు. దుబాయ్ లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024కు గౌరవ అతిథిగానూ ప్రధాని హాజరై ప్రసంగిస్తారు.
PM @narendramodi emplanes for two-nation visit to the UAE and Qatar. pic.twitter.com/wvWVtE2Q0b
— PMO India (@PMOIndia) February 13, 2024
2015 నుంచి ప్రధాని హోదాలో మోదీ UAEని సందర్శించడం ఇది ఏడవ సారి. ఈ టూర్ లో మోదీ ఆదేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్, వైవ్ ప్రెసిడెంట్లతో భేటీ కానున్నారు. ఈరోజు ప్రధాని మోదీ UAEలో భారతీయులను కలవడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని Xలో ఓ పోస్ట్ చేశారు. UAEలో పర్యటన మోదీకి సంతోషంగా ఉందని ఆయన X ద్వారా తెలిపారు.
ప్రదాని హోదాలో ఏడవ సారి మోదీ UAE పర్యటన
2024 జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చిన సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని ఓప్పందాలు కుదిరాయి. సంవత్సరకాలంలో భారత్, UAE అధికారికంగా 5 సార్లు సమావేశమయ్యాయి. 2023లో మోదీ అబుదాబీలో ఆ దేశ అధ్యక్షుడిని కలిశారు. అదే ఏడాది నవంబర్ 30న కూడా కాప్-28లో పాల్గొన్నప్పుడు కూడా ఇరువురు భేటీ అయ్యారు.