ప్రకృతి సేద్యం చేయండి.. గుజరాత్ భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

ప్రకృతి సేద్యం చేయండి.. గుజరాత్ భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ లోని భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలు ప్రకృతి సేద్యాన్ని అవలంబించాలని, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా చెట్లు నాటాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశుపోషణే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న భర్వాడ్ తెగ ప్రజలు 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సహకరించాలని కూడా ఆయన కోరారు.

గురువారం గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లా ధోలేరా తాలూకా బవలియాలీ ధామ్‌‌లో జరిగిన కార్యక్రమంలో భర్వాడ్ కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి మోదీ వర్చువల్‌‌గా మాట్లాడారు.