ప్రమాణస్వీకారం తర్వాత ఇటలీకి వెళ్లనున్న మోదీ

ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 8న ఎన్డీయే కూటమి తరుపున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారం తర్వాత ఆయన ఫస్ట్ విదేశీ పర్యటన ఇటలీకి వెళ్లనున్నారు. ఇటటీ ప్రధాని జార్జియా మెలోని G7 సమ్మిట్‌కు హాజరు కావాలని నరేంద్ర మోడీని ఆహ్వానించారు.  జూన్ 13,14 తేదీల్లో గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) సమావేశానికి భారత్ ప్రధాని హోదాలో మోదీ హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన తర్వాత జార్జియా మెలోని మోదీకి అభినందనలు తెలిపారు.

G7 సమ్మిట్ 2024  జూన్ 13 నుంచి15 తేదీలలో అపులియాలోని బోర్గో ఎగ్నాజియాలో నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్‌కు చెందిన ఫ్యూమియో కిషిసా మరియు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.