మధ్య తరగతికి అనుకూలంగా బడ్జెట్.. ప్రధాని మోదీ ఇచ్చిన హింట్ అదేనా..?

మధ్య తరగతికి అనుకూలంగా బడ్జెట్.. ప్రధాని మోదీ ఇచ్చిన హింట్ అదేనా..?

బడ్జెట్ సమావేశాలు ఇవాళ (జనవరి 31న) ప్రారంభం కావడంతో అందరి దృష్టి ఈసారి బడ్జెట్ ఎలా ఉండనుందనే అంచనాలపైనే నెలకొంది. అయితే 2025-26 బడ్జెట్ మధ్య తరగతికి అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇచ్చిన హింట్ ఆధారంగా ఈసారి మిడిల్ క్లాస్ ను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

శుక్రవారం(జనవరి 31న) బడ్జెట్ ప్రారంభ సమావేశాలలో ప్రసిడెంట్ ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అంతకుముందు ప్రధాని మోదీ బడ్జెట్ పై మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మధ్యతరగతికి ఆశావాహమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పేద మధ్య తరగతి ప్రజలకు సిరులు కురిపించాలని, వారిపై ఆశీస్సులు ఉంచాలని లక్ష్మీ దేవతను ప్రార్థిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. విక్షిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో బడ్జెట్ ఆత్మవిశ్వాసం, శక్తిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదాని మోదీ వ్యాఖ్యలతో ఈ సారి మిడిల్ క్లాస్ కు ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇన్నోవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ సూత్రాల ఆధారంగా దేశ ఆర్థిక ప్రయాణం సాగుతోందని ప్రదాని మోదీ తెలిపారు. అదే విధంగా 2014 తర్వాత మొట్ట మొదటి సారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు విదేశాల నుంచి ఎలాంటి అలజడి, అంతరాయం కలగలేదని అన్నారు.