మేరీ మిట్టి మేరా దేశ్ అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ కల అని అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మేరీ మిట్టి మేరా దేశ్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మల్లన్నపేట నుండి మట్టిని సేకరించారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. గతంలో ఏనాడూ జీ20 సమావేశాల్లో విదేశీ ప్రముఖులు హాజరు కాలేదని.. కానీ మోదీ మీద గౌరవంతో మొట్టమొదటగా 40 దేశాలకు చెందిన విదేశీ ప్రముఖులు హాజరయ్యారని తెలిపారు. ఇతర దేశాల నాయకులు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ జీ20 సమావేశాలతో ప్రజలు విక్టరీ సాధించినట్లేనన్నారు .
ALSO READ : గురుద్వారాలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా పూజలు
అనంతరం పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే గొల్లపల్లి, ఎండపల్లి,బూగ్గారం,ధర్మపురి మండలాల్లో పలు మృతుల కుటుంబాలను వివేక్ పరామర్శించారు.