కరీంనగర్బీజేపీ విజయ సంకల్పసభలో ప్రదాని మోదీ పాల్గొన్నారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి శుభాభినందనలు అంటూ ప్రదాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మళ్లీ మళ్లీ చెబుతున్నానని కరీంనగర్ గడ్డపై అనేక గ్యారంటీలు ప్రకటించారు.
మోదీ ఎన్నికల సభలో హైలెట్స్
- కరీంనగర్ పోడశ మహాపదాల్లో ఒకటి.. ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు
- తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది
- తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంను బీజేపీ చేస్తుంది.. తెలంగాణను హిందూ దేశంలో అగ్రస్థానంలో ఉంచుతాం
- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తప్పక ఏర్పడుతుంది
- పదేళ్ల పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి
- పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ది కుంటుపడింది
- దేశంలోని అన్ని రాష్ట్రాలను బీజేపీ అభివృద్ది చేస్తుంది
- తెలంగాణలో బీఆర్ఎస్ .. కాంగ్రెస్ ఒక్కటే
- తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
- కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే
- బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి
- కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ కు ఓటెయ్యద్దు
- తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు... కుటుంబ పాలనలో పీవీకి అవమానం జరిగింది
- కాంగ్రెస్.. బీఆర్ఎస్ అంటే అవినీతి, కుటుంబ పాలన
- కుటుంబ పాలనలో ఎప్పుడూ వారి పిల్లల గురించే ఆలోచిస్తారు
- బీజేపీ, కాంగ్రెస్ తో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు మోదీ పిలుపు
- బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది
- తెలంగాణలో నక్సలిజం ఉంది... బీజేపీ మాత్రమే నక్సలిజానికి చెక్ పెడుతుంది
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీఆర్ఎస్లోకి వెళతారో తెలియదు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేశాయి
- కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ చేస్తామంటే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది
- మోదీ సర్కార్ రైతుల అభివృద్దికి అనేక చర్యలు తీసుకుంది
- బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ది చెందుతుంది
- కరీంనగర్ ను కేసీఆర్ లండన్ చేస్తానన్నారు.. అది ఏమైంది? ఫిలిగ్రీ కళకు తెలంగాణ పెట్టింది పేరు
- అవినీతిని అరికడతానని మోదీ గ్యారంటీ
- కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పీఎఫ్ఐ వంట సంస్థలు పెరిగాయి
- రైతులకు నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు.. దానికి శిక్ష పడాలా వద్దా
- మోడీ నీడ పడితేనే కేసీఆర్ భయపడుతున్నారు
- బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ చైకగా లభిస్తుంది.
- అందరికి ఉచిత రేషన్ .. ఇది మోదీ గ్యారంటీ
- హస్తకళాకారులకు గ్యారంటీలు లేకుండానే ఇస్తున్నాం
- సామాజిక న్యాయం బీజేపీతో సాధ్యం
- నీళ్లు.. నిధులు.. నియామకాలు ఎక్కడని మోదీ ప్రశ్నించారు
- కన్నీళ్లు, మోసాలు.. నిరుద్యోగాన్ని తెలంగాణలో కేసీఆర్ అభివృద్ది చేశారు
- డిసెంబర్ 3 వ తేదీన కేసీఆర్ పని అయిపోయింది
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని పథకాల్లో అవినీతి జరుగుతుంది
- తెలంగాణ అభివృద్దికి బీజేపీ భరోసా.. మోదీ భరోసా ఇస్తున్నా
- తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
- తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాలి
- ఇరిగేషన్ స్కాంలో అవినీతి చేసిన వారిని జైలుకు పంపిస్తాం
- కేసీఆర్ ఫాం హౌస్ సీఎం.. మోడీ దేశానికి పీఎం