పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అవ్వటం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ది పొందే మోసానికి పాల్పడిన విషయంలో కేసు నమోదు ఫైల్ చేశారు. ఈ కేసులో అదానీ సహా అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఏడు మంది నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. అదానీ కేసు విషయంలో ప్రధాని మోడీ పేరును కూడా చార్జిషీట్లో చేర్చాలంటూ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది.
Modi’s name is bound to be included after the charge procedure begins. https://t.co/gxuu1s4rZr
— Subramanian Swamy (@Swamy39) November 21, 2024
అదానీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ అదానీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. అంతే కాకుండా ఈ కేసుతో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులకు కూడా సంబంధం ఉందంటూ వార్తలు రావటం చర్చనీయాంశం అయ్యింది.
ALSO READ | గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్