Harry Brook: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. మొయిన్ అలీ ఇలా అనేశాడేంటి!

Harry Brook: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం.. మొయిన్ అలీ ఇలా అనేశాడేంటి!

ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో బ్రూక్ పై రెండేళ్ల పాటు ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా బ్యాన్ చేసింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ 2025, 2026 ఐపీఎల్ సీజన్స్లో ఆడడానికి వీలు లేదు. వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా రెండేళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నియమనిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఈ రూల్ విధించిన తర్వాత నిషేధం ఎదర్కొన్న తొలి ఆటగాడు బ్రూక్. 

బ్రూక్ పై నిషేధం విధించడడంతో ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ మొయిన్ అలీ బీసీసీఐ రూల్ ను సమర్ధించాడు. ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ నిషేధం ఖచ్చితంగా 'కఠినమైనది' కాదని చెప్పాడు. అలీ మాట్లాడుతూ.. "గతంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఇలాగే చేశారు. ఆపై తిరిగి వచ్చి మెరుగైన ఆర్థిక ప్యాకేజీని పొందారు. ఇలాంటి విషయాలు గందర గోళానికి గురి చేస్తాయి. బ్రూక్ తప్పుకోవడంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రణాళికలన్నింటినీ మార్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది.  కుటుంబ కారణాల వల్ల లేదా గాయం వలన తప్పుకుంటే అది వేరుగా ఉండేది. కానీ బ్రూక్ కారణం వేరుగా ఉంది. ఈ విషయంలో నేను బీసీసీఐ రూల్ తో ఏకీ భవిస్తున్నాను". అని మొయిన్ చెప్పుకొచ్చాడు.

ALSO READ | RCB 2025: మా టైమ్ వస్తుంది.. వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొడతాం: రూ. 11 కోట్ల RCB ప్లేయర్

బ్రూక్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో భాగంగా  ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇది. ఈ సిరీస్ పైనే బ్రూక్ తన పూర్తి దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. బ్రూక్ స్థానంలో ఢిల్లీ ఇంకా ఎవరినీ తీసుకోలేదు. ఐపీఎల్ నుంచి తనకు తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్రూక్ క్షమాపణలు తెలిపాడు.