Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించాడు. నాజర్ హుస్సేన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శనివారం (సెప్టెంబర్ 7) మొయిన్ తాను రిటైర్ అవుతున్నట్టు తెలిపాడు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వాలని.. రిటైర్మెంట్ అవ్వడానికి ఇదే సరైన నిర్ణయమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కు స్థానం దక్కలేదు. దీంతో ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి ఇదొక కారణం అని అర్ధమవుతుంది. 

Also Read:-జురెల్ విన్యాసాలు.. వరుసగా నాలుగు క్యాచ్‌లు

మొయిన్ అలీ 2021లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే 2023 యాషెస్ లో ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడడంతో మొయిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని మళ్ళీ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో ఆడాడు. ఈ యాషెస్ ముగిసిన అనంతరం మళ్ళీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే తాజాగా అతను వైట్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 

2014లో మొయిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడాడు. 2019లో సొంతగడ్డపై ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్.. 2022 లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో అలీ సభ్యుడు. ఆల్ రౌండర్ గా ఇంగ్లండ్ తరపున మొయిన్ అలీ 68 టెస్టులు, 138 వన్డేలు, 92 ట్వంటీ20లు ఆడాడు.ఒక వన్డే, 12 టీ20 మ్యాచ్ లకు ఇంగ్లాండ్ కెప్టెన్సీ చేశాడు.