![మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత](https://static.v6velugu.com/uploads/2024/03/mogalirekulu-serial-actor-pavitranath-passes-away_ceN8oYgDZ9.jpg)
ప్రముఖ బుల్లితెర నటుడు, మొగలిరేకులు ఫేమ్ పవిత్రనాథ్(Pavitranath) కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మొగలిరేకులు సీరియల్ లో దయ పాత్రలో ఆడియన్స్ కు దగ్గరైన పవిత్రనాథ్ మరణవార్త తెలిసి.. ఆయన అభిమానులు షాకవుతున్నారు. అతిచిన్న వయసులో ఆయన కన్నుమూయడంతో పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
ఊహించని విధంగా.. హఠాత్తుగా పవిత్రనాథ్ మరణవార్త విని షాక్ అవుతున్నారు ఆయన అభిమానులు. ఈ విషయాన్ని నమ్మలేక మిత్రులను అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఆయన మరణానికి కారణం ఏంటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పవిత్రనాథ్ మరణానికి గల అసలు కారణాలు ఏంటో అనేది తెలియాల్సి ఉంది.