- మొగల్‌పహాడ్ రైతుల ఆగ్రహం
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ బూడిద చెరువు కోసం 1982లో 553 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుని నష్టపరిహారం చెల్లించలేదని, ఇప్పుడు నెలకొల్పుతున్న ఎన్టీపీసీ ఫేజ్-2 ప్లాంట్బూడిద చెరువు కోసం మళ్లీ 606 ఎకరాల భూములు తీసుకోవడానికి మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తోందని అంతర్గాం మండలం మొగల్‌పహాడ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ నాడు కోర్టులో కేసు నడుస్తోందని చెప్పి నష్టపరిహారం చెల్లించలేదని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఎన్టీపీసీ మోసం చేసిందన్నారు. మమ్మల్ని గోస పెట్టకండి.. మా కుటుంబాలను రోడ్డున పడేయకండి.. అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చిలుక ప్రసాద్, చిలుక రాజేశం, దువ్వాసి నర్సయ్య, డేగల నర్సయ్య, కొలాని శ్రీనివాస్, మహేందర్ పాల్గొన్నారు.