హైదరాబాద్, వెలుగు: ఐఎన్టీయూసీ(ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) వైస్ ప్రెసిడెంట్ గా మొగుళ్ల రాజిరెడ్డి నియమితులయ్యారు. ఆదివారం రాజిరెడ్డికి ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ సంజీవరెడ్డి నియామకపత్రం అందచేశారు.
జనగామ జిల్లాకు చెందిన రాజిరెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ జల మండలి కామ్గార్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేయాలని సంజీవ రెడ్డి సూచించారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. తనకు ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందుకు సంజీవ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.