- వేం నరేందర్ రెడ్డిని కోరిన రాజిరెడ్డి
చేర్యాల, వెలుగు: జల మండలి ఉద్యోగుల సమస్యలు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి శుక్రవారం ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డికి బర్త్డే విషెస్చెప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. పదకొండేళ్లుగా జలమండలి ఉద్యోగులు వేతనాల పెంపు, ప్రమోషన్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వారందరికీ ఉచిత హెల్త్ కార్డులు జారీచేయాలని కోరారు. అనంతరం స్పందించిన నరేందర్రెడ్డి సీఎంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఐఎన్టీయూసీ నేతలు పాల్గొన్నారు.