- హెల్త్ కార్డులు జారీ చేసేలా చూడండి
- ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి విజ్ఞప్తి
బషీర్ బాగ్, వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వాటర్బోర్డు ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వాటర్బోర్డు కంగర్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి కోరారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. 11 ఏండ్లుగా వాటర్బోర్డు ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని చెప్పారు.
వేతనాల పెంపు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, ప్రమోషన్లు పెండింగ్పెట్టారని తెలిపారు. ఉద్యోగులందరికీ ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయాలని ఇప్పటికే ఐఎన్టీయూసీ, వాటర్బోర్డు కంగర్ యూనియన్ నుంచి వినతి పత్రం ఇచ్చామని రాజిరెడ్డి చెప్పారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నేతలు చక్రధర్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.