పరకాల, వెలుగు : కేసీఆర్ అధికారంలో ఉంటేనే మైనార్టీలకు మంచి జరుగుతుందని, ఇప్పటి వరకు మైనార్టీలను ఆదుకున్నది ఒక్క కేసీఆరే అని హోం మినిస్టర్ మహ్మద్ అలీ చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఎంఎన్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమేళనంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల బాగు కోసం కేసీఆర్ ఏవిధంగానైతే ఆలోచన చేస్తాడో అదే విధంగా పరకాల నియోజకవర్గ ప్రజల కోసం ధర్మారెడ్డి అదే విధంగా ఆలోచిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక కేసీఆర్ మైనార్టీల అభ్యున్నతికి, వారి సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం
ఆత్మకూరు (దామెర), వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందని పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చెప్పారు. మంగళవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, దామెర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. . పేదల కష్ట సుఖాలను గమనించిన కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛనులు అందిస్తూ ఆదుకున్నాడని చెప్పారు. నియోజక వర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, అభివృద్ధి పనులు చూసి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్నర్ మీటింగ్ కు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ALSO READ : వరంగల్ తూర్పులో బీజేపీ గెలుపు ఖాయం : ఎర్రబెల్లి ప్రదీప్ రావు