Pakistan Cricket: రెండు రోజుల్లో ఇద్దరు: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

Pakistan Cricket: రెండు రోజుల్లో ఇద్దరు: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కు మరో పాకిస్థాన్ క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) తాను అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అమీర్‌కి ఇది రెండో రిటైర్మెంట్. అంతకముందు వీడ్కోలు  ప్రకటించిన ఈ పేసర్.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇమాద్ వసీమ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత గంటల వ్యవధిలోనే అమీర్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు.      

‘‘పాకిస్థాన్‌ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడడం గొప్ప గౌరవం. ఇది చాలా కష్టమైన నిర్ణయమని నాకు తెలుసు. కానీ రానున్న తరాలు కొత్త శిఖరాలు చేరుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాలి. రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను". అని అమీర్ తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2019లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లీగ్ ల్లో ఆడుతున్నాడు.  

Also Read :- సెంచరీతో పాకిస్థాన్ బౌలర్లపై శివాలెత్తిన హెండ్రిక్స్

జూన్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ లో అమీర్ అరంగేట్రం చేశాడు. అమీర్ కెరీర్ 15 సంవత్సరాలు సాగినా పాకిస్థాన్ తరపున తక్కువ మ్యాచ్ లు ఆడాడు. తన కెరీర్ లో  36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మాట్ లలో మొత్తం 271 వికెట్లు తీసుకోవడంతో పాటు 1,179 పరుగులు చేశాడు. అమెరికా, వెస్టిండీస్‌లో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపునఅమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.