ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్..

ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్..

భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ మంగళవారం ( అక్టోబర్ 8, 2024 )  ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన అజారుద్దీన్ పై రూ. 3.8కోట్ల అక్రమాల కేసుతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు అజారుద్దీన్.

Also Read :- గల్ఫ్ ఏజెంట్ మోసంతో ఇరాక్ లో చిక్కుకున్న జగిత్యాల యువకుడు

2020 నుండి 2023 వరకు హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన అజారుద్దీన్.. ఇప్పటికే ముందస్తు బెయిల్ పై ఉన్నారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యారు అజారుద్దీన్.ఇదిలా ఉండగా తనపై తప్పుడు అభియోగాలు మోపారంటూ ఈడీ విచారణకు హాజరైన సమయంలో మీడియాతో అన్నారు అజారుద్దీన్.