హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. గురువారం(అక్టోబర్ 03) ఈడీ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన అజారుద్దీన్ తన హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం అవసరాల కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక పరికరాల కొనుగోళ్లు కోసం కేటాయించిన రూ.20 కోట్లను దుర్వినియోగం చేశారని ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అందులో భాగంగా అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది.