
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని HCAకు అంబుడ్స్ మన్ జస్జిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. HCA ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయించారు. దీనిపై హెచ్ సీఏకు అనుబంధంగా ఉన్న లార్డ్స్ క్రికెట్ క్లబ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను అంబుడ్స్ మన్ విచారణ జరిపింది.
ఈ సందర్భంగా తన పేరు తానే పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్ మన్ తెలిపింది. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్ మన్ తీర్పు తీర్పునిచ్చింది. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని HCAను ఆదేశించింది. టికెట్లపై ఇక నుంచి ఆ పేరు ప్రస్థావన ఉండొద్దని తేల్చి చెప్పింది అంబుడ్స్ మన్.
ఉప్పల్ స్టేడియంలో నార్త్ పెవిలియన్ టెర్రస్ స్టాండ్ కు మహ్మద్ అజారుద్దీన్ పేరు పెట్టారు. 2019లో హెచ్ సీఏ అధ్యక్షుడు అయిన అజారుద్దీన్ తన పేరుతో స్టాండ్ ను నిర్మించారు. వీవీఎస్ లక్ష్మణ్ డిసెంబర్ 7న 2019లో ప్రారంభించారు.
అజారుద్దీన్ భారత్ తరపున 99 టెస్టులు,334 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 22 సెంచరీలు, వన్డేలో 7 సెంచరీలు చేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అర్థాంతరంగా క్రికెట్ కెరీర్ ముగించాడు. తర్వాత హెచ్ సీయూ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నార్త్ బ్లాక్ కు తన పేరు పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.