దేశవాళీ క్రికెట్ చచ్చిపోయింది.. పాక్ మాజీ క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్

దేశవాళీ క్రికెట్ చచ్చిపోయింది.. పాక్ మాజీ క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్

టీ20 క్రికెట్ అంటే సెలక్టర్లు యువ క్రికెటర్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ పాక్ క్రికెట్ లో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.  న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టు ఎంపిక చేసిన 17 మంది ప్రాబబుల్స్ లో సీనియర్ ప్లేయర్లకే పెద్ద పీఠ వేసింది. ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ లాంటి ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఎంత మంది ఉన్నా.. వారిని గుర్తించడం లేదు. దీంతో పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 

పాక్ దేశవాళీ క్రికెట్ చచ్చిపోతుంది అని హాఫిజ్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా  మారుతుంది. జట్టులో చోటు కోసం శ్రమిస్తున్న యువ ఆటగాళ్లను వదిలేసి రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ లకు స్థానం ఇవ్వడం హఫీజ్ కు నచ్చడం లేదని సమాచారం. ఈ కారణంగానే డొమెస్టిక్ క్రికెట్ కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సీనియర్లతో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో సత్తా చాటిన వారికే సెలక్టర్లు ఓటేశారు.

also read : టాస్ గెలిచిన పంజాబ్.. మార్పులు లేకుండా బరిలోకి సన్‌రైజర్స్

17 మంది స్క్వాడ్ లో ఐదుగురు ట్రావెలింగ్ రిజర్వ్‌ ఆటగాళ్లతో పాటు..ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తొలిసారి పాక్ టీ20 జట్టులో స్థానం దక్కింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో సత్తా చాటిన వారికి అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం ఇచ్చారు. ఉస్మాన్ ఖాన్ రెండు సెంచరీలతో మొత్తం 430 పరుగులలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.కరాచీ కింగ్స్ తరఫున ఇర్ఫాన్ ఖాన్ 9 మ్యాచ్‌లలో 140.16 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. లెగ్ స్పిన్నర్ అబ్రార్ క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరపున 10 మ్యాచ్‌లలో 19.56 సగటుతో 16 వికెట్లను పడగొట్టాడు.