డ్రంకెన్ డ్రైవ్​లో .. ఇద్దరికి జైలు​శిక్ష

భిక్కనూరు,వెలుగు:   డ్రంకెన్ డ్రైవ్​  కేసులో ఇద్దరికి  జైలు​శిక్ష విధించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.ఆయన తెలిపిన ప్రకారం  గురువారం రాత్రి భిక్కనూరు చర్చి సమీపంలో డ్రంకెన్ డ్రైవ్​ నిర్వహించామన్నారు. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన సంజీవులు, వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన మహ్మద్ జమీలోద్దిన్​ మద్యం తాగి బైక్​ నడుపుతూ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు.

శుక్రవారం జిల్లా కోర్టులో హాజరు పరచగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి ప్రతాప్​ మూడు రోజుల జైలు​శిక్షతో పాటు ​రూ.200  జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.