వరల్డ్ కప్ కి ముందు టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తుంది. టెస్టుల్లో, టీ 20ల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్.. ఈ రోజు ఆస్ట్రేలియా మీద తొలి వన్డే గెలిస్తే మూడు ఫార్మాట్ లలో నెంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఫీల్డింగ్ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. జట్టులో ఫీల్డింగ్ నైపుణ్యానికి కొదువ లేకపోయినా.. ఆటగాళ్ల నిర్లక్ష్యం ఇప్పుడు అభిమానుల్లో కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. తాజాగా భారత ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేసాడు.
‘టీమిండియా ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టం. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది అనుకుంటే పొరపాటే.ఫీల్డింగ్ మీద దృష్టి పెట్టాలి. అంటూ కైఫ్ ట్వీట్ చేశాడు. కైఫ్ చేసిన వ్యాఖ్యల్లో అర్ధం లేకపోలేదు. ప్రస్తుతం మొహాలీలో టీమిండియా ఫీల్డింగ్ చూసుకుంటే అత్యంత పేలవంగా ఉంది. 9వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన సునాయాసన క్యాచ్‌ని శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు.14 పరుగుల వద్ద బతికిపోయిన వార్నర్ హాఫ్ సెంచరీ చేసాడు. ఇక లబుషేన్ 11 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద రాహుల్ ఈజీ రనౌట్‌ని మిస్ చేసాడు.
Do you agree with Mohammad Kaif?
— CricTracker (@Cricketracker) September 22, 2023
?: Jio Cinema pic.twitter.com/OWNacZmwqD
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నలబుషేన్.. 39 పరుగులు చేసాడు. ఇక ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచులో కూడా టీమిండియా ప్లేయర్లు చాలా సునాయాసన క్యాచులని వదిలేశారు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి తప్పులు రిపీట్ చేస్తే టీమిండియాకు కైఫ్ చెప్పినట్టు కప్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.