మునుగోడు మైనార్టీ ఇన్​చార్జిగా మహ్మద్ రఫీ  

చౌటుప్పల్, వెలుగు : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మైనార్టీ మునుగోడు ఇన్​చార్జిగా చౌటుప్పల్ కు చెందిన మహ్మద్ రఫీని నియమిస్తూ ఏఐసీసీ మైనార్టీ డిపార్ట్​మెంట్​వైస్ చైర్మన్ ఫర్హాన్ అజ్మీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం చౌటుప్పల్ లోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రఫీకి ఆర్డర్​ కాపీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం మైనార్టీలు కృషి చేయాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు రాజు గౌడ్, బాలు మహేందర్, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మోగదాల రమేశ్ పాల్గొన్నారు.