ఓవైపు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు పాకిస్తాన్ బ్యాటర్లు అతని అంతర్జాతీయ రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉన్నారు. పాక్ వికెట్ కీపర్/ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో అతను పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంల రికార్డును అధిగమించాడు. రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో అతను ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 3000 పరుగులు చేరుకోవడానికి విరాట్ కోహ్లి, బాబర్ ఆజాంలలు 81 ఇన్నింగ్స్‌ల చొప్పున తీసుకోగా.. రిజ్వాన్ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 3వేల పరుగులు చేసిన ఆటగాళ్లు
- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్): 79 ఇన్నింగ్స్‌లు
- విరాట్ కోహ్లి (భారత్): 81 ఇన్నింగ్స్‌లు
- బాబర్ ఆజాం (పాకిస్తాన్): 81 ఇన్నింగ్స్‌లు
- ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 98 ఇన్నింగ్స్‌లు
- మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్): 101 ఇన్నింగ్స్‌లు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 18.1 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పాక్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని 12.1 ఓవర్లలోనే చేధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది.
Pakistan go 1️⃣ up in the series with a thumping seven-wicket win in Rawalpindi 👏#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/05DMYDE3F8
— Pakistan Cricket (@TheRealPCB) April 20, 2024