Mohammad Rizwan: నేను చదువుకోలేదు.. నాకు ఇంగ్లీష్ రాదు: ట్రోలర్స్‌కు పాకిస్థాన్ కెప్టెన్ అదిరిపోయే రిప్లై

Mohammad Rizwan: నేను చదువుకోలేదు.. నాకు ఇంగ్లీష్ రాదు: ట్రోలర్స్‌కు పాకిస్థాన్ కెప్టెన్ అదిరిపోయే రిప్లై

పాకిస్తాన్ వైట్-బాల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లీష్ మాట్లాడటం పట్ల చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అర్ధం కాని ఇంగ్లీష్ తో మాట్లాడతాడని.. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా మంది ఈ పాకిస్థాన్ కెప్టెన్ ను తక్కువ చేసి మాట్లాడారు. ఇంగ్లీష్ మాట్లాడటం పట్ల చాలా కాలంగా ఎగతాళి చేస్తున్న సోషల్ మీడియా ట్రోలర్లకు రిజ్వాన్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. తన చదువు పూర్తి చేయనందుకు చింతిస్తున్నానని.. అయితే తన భాషా నైపుణ్యాల పట్ల తాను సిగ్గుపడటం లేదని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రిజ్వాన్.. మ్యాచ్ ముందు విలేకరుల సమావేశంలో తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావించాడు. జియో న్యూస్ తో మాట్లాడుతూ.. "నా చదువును పూర్తి చేయనందుకు నేను చింతిస్తున్నాను. ఈ కారణంగానే నాకు ఇంగ్లీష్ తెలియదు. కానీ పాకిస్తాన్ కెప్టెన్‌గా నేను ఇంగ్లీష్ మాట్లాడలేనందుకు నేను సిగ్గుపడను. పాకిస్థాన్ కెప్టెన్ గా నేను మంచి క్రికెట్ ఆడడానికి ఉన్నా. నేను మంచి క్రికెట్ ఆడడంపైనే ద్రుష్టి పెట్టా. ఇంగ్లీష్ మాట్లాడటంపై కాదు. పాకిస్తాన్ క్రికెట్ నా నుంచి  ఇంగ్లీష్ కోరుకుంటే నేను ప్రొఫెసర్‌ని అయ్యేవాడిని. కానీ పాకిస్తాన్ నన్ను ఇంగ్లీష్ కాదు నా నుంచి క్రికెట్ ఆశిస్తోంది". అని రిజ్వాన్ తెలిపాడు.

ప్రస్తుతం రిజ్వాన్ పాకిస్థాన్ క్రికెట్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ముల్తాన్ సుల్తాన్ జట్టు తరపున ఆడుతున్న అతను కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్థాన్ వరుసగా ఓడిపోతుంది. స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక విజయం లేకుండా ముగించిన పాకిస్థాన్ ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి 1-4 తేడాతో టీ20 సిరీస్ ను 0-3 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. త్వరలోనే  రిజ్వాన్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో వైట్ బాల్ ఫార్మాట్ లో బాబర్ అజామ్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. 

►ALSO READ | LSG vs GT: గిల్, సుదర్శన్ మెరుపులు.. లక్నో ముందు ఛాలెంజింగ్ టార్గెట్!