పాకిస్థాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇటీవలే సంచలన ప్రదర్శనతో 2-1 తో వన్డే సిరీస్ గెలుచుకున్న పాకిస్థాన్.. టీ20 సిరీస్ లో బోణీ చేయలేకపోయింది. ఒక మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో టీ20 సిరీస్ ను కోల్పోయింది. నేడు (నవంబర్ 18) హోబర్ట్ వేదికగా మూడో టీ20 కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఆశ్చర్యకరంగా తుది జట్టులో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో అఘా సల్మాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
పాకిస్థాన్ క్రికెట్ ఎప్పుడు ఏం చేస్తుందో ఒక అంచనాకు రావడం కష్టం. తరచూ కోచ్, కెప్టెన్ లను మార్చే ఆ జట్టు తాజాగా తుది జట్టులో ఏకంగా కెప్టెన్ ను పక్కన పెట్టి సాహసం చేశారు. ఈ మ్యాచ్ లో రిజ్వాన్ ను తప్పించడానికి కారణం లేకపోలేదు. అతను రెండో టీ 20లో నత్త నడకన బ్యాటింగ్ చేశాడు. ఆత్మ రక్షణ ధోరణలో ఆడుతూ పూర్తిగా డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక బౌండరీ మాత్రమే ఉండడం విశేషం.
పదో ఓవర్ లో రిజ్వాన్ ఔటయ్యే సమయానికి మ్యాచ్ అప్పటికే ఆసీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో పాక్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించలేకపోయారు. దీంతో ఓ మాదిరి లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కాపాడుకోగలిగింది. ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న పాక్.. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది.
HOBART: Captain Mohammad Rizwan has been rested as Pakistan announced their Playing XI for the third T20I against Australia.#babaazam pic.twitter.com/rVvz1p9vvW
— Explore USA (@exploreusa7535) November 18, 2024