సాధారణంగా భారీ ఇన్నింగ్స్ లు ఆడేటప్పుడు ఆటగాళ్లు అలసిపోతూ ఉండడం సహజం. విరాట్ కోహ్లీ లాంటి ఫిట్ నెస్ ఉన్న ప్లేయర్లకు ఇలాంటి సమస్య రాకపోయినా దాదాపుగా చాలా మంది ప్లేయర్లు మెడికల్ ట్రీట్ మెంట్ కోసం ఆట మధ్యలో వైద్యున్ని సంప్రదిస్తారు. కానీ పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ మాత్రం అందరికి భిన్నం. మైదానంలో ఒక గంట ఉన్నాడంటే చాలు అలసిపోయినట్లుగా కిందపడిపోతాడు.
మొదట్లో ఇది చూసినవారు రిజ్వాన్ పై జాలి చూపించినా పదే పదే ఇలాచేయడం చూసి ఫ్యాన్స్ ఓవరాక్షన్ గా భావించారు. మరి కొందరైతే రిజ్వాన్ ఇలా ఎందుకు చేస్తున్నాడనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక నిన్న వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఈ పాక్ బ్యాటర్ భారీసెంచరీతో పాక్ ని గెలిపించిన సంగతి తెలిసిందే. ప్రతిసారిలాగే ఈ సారి కూడా ఛేజింగ్ సమయంలో 90 పరుగులు చేసిన తర్వాత చాలా సార్లు తిమ్మిరితో బాధపడుతూ కనిపించాడు.
ALSO READ: Cricket World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్.. అశ్విన్ స్థానంలో ఆల్‌రౌండర్‌కి చోటు
ఇక మ్యాచ్ తర్వాత సైమన్ డౌల్ రిజ్వాన్ ని తన తిమ్మిరి గురించి అడిగాడు. దీనికి ఈ పాక్ బ్యాటర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఈ మ్యాచులో కొన్నిసార్లు తిమ్మిరి వచ్చాయి కొన్నిసార్లు నేను నటించాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. రిజ్వాన్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి రిజ్వాన్ చెప్పిన ఈ సమాధానం నిజమో లేకపోతే సరదాగా చెప్పాడో అతనికే తెలియాలి. కాగా.. ప్రస్తుతం రెండు మ్యాచులాడిన రిజ్వాన్199 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
Mohammad Rizwan's hilarious reply on question regarding suffering cramps during Sri Lanka World Cup clash#CWC23 #PAKVSL #Rizwan pic.twitter.com/MTxemcJ7S8
— Cricket Pakistan (@cricketpakcompk) October 10, 2023