
29 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ లో ఐసీసీ టోర్నీ జరగడంతో ఆ దేశంలో సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో సాగాయి. సొంతగడ్డపై తమ జట్టు అద్భుతంగా రాణిస్తుందని ఈజీగా సెమీస్ కు చేరుతుందని పాకిస్థాన్ ఫ్యాన్స్ భావించారు. పైగా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే టోర్నీ ప్రారంభమైన ఐదు రోజులకే పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ దాదాపుగా నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన పాక్.. సెమీస్ కు వెళ్లాలంటే అద్భుతం జరగాల్సిందే.
భారత్ పై ఓటమితో పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తమ జట్టు సెమీస్ అవకాశాలను కోల్పోయిందని నిరాశ వ్యక్తం చేశాడు. రిజ్వాన్ మాట్లాడుతూ " ఛాంపియన్స్ ట్రోఫీలో మా కథ ముగిసింది. ఇదే నిజం. మా అవకాశాలు ఏదో ఒక మూల ఉన్నప్పటికీ మేము సెమీస్ కు చేరడం దాదాపు అసాధ్యం. తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో ఏమి చేస్తుంది.. న్యూజిలాండ్ ఇండియాతో ఎలా ఆడుతుందో చెప్పలేం.
ఇదొక సుదీర్ఘ ప్రయాణం. మా ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు ఇతర జట్లపై ఆధారపడ్డాయి. కెప్టెన్‌గా నేను దీన్ని ఇష్టపడను.మేము మా స్వంతంగా ఏమీ చేయలేని పరిస్థితి. న్యూజిలాండ్, ఇండియాపై ఓటములను మేము అంగీకరిస్తున్నాము. కానీ ఇతర ఫలితాల కోసం చూస్తూ కూర్చోకూడదనుకుంటున్నాము".అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
ALSO READ | IND vs PAK: సింగిల్ కాదు.. సిక్సర్ కొట్టు: డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లీకి రోహిత్ సైగ
గ్రూప్ ఏ లో మరో మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటిలో పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ విజయం సాధించడం తప్పనిసరి. సోమవారం (ఫిబ్రవరి 24) జరిగే గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా ఓడిపోవాలి. ఆదివారం (మార్చి 2) న్యూజిలాండ్ పై టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితే రోహిత్ సేన మూడు మ్యాచ్ ల్లో గెలిచి టాప్ లో ఉంటుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ గెలిచి సెమీస్ రేస్ లో ఉంటాయి.
Mohammad Rizwan gives up on Pakistan’s hope to win Champions Trophy at home
— SportsTiger (@The_SportsTiger) February 24, 2025
📷: ICC#MohammadRizwan #PCB #PAKvIND #ChampionsTrophy #CT25 #PakistanCricketTeam pic.twitter.com/wT4kuPoIBx