టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తాజాగా 2019 వన్డే వరల్డ్ కప్ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో తనను కీలకమైన సెమీ ఫైనల్లో పక్కన పెట్టారని విచారం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ 2019 వరల్డ్ కప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీఫైనల్లో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్ మీద కూర్చోపెట్టారని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి లపై ఆరోపణలు చేశారు.
తన యూట్యూబ్ షో 'అన్‌ప్లగ్డ్'లో శుభంకర్ మిశ్రాతో మాట్లాడుతూ..“2019 వరల్డ్ కప్ లో నేను మొదట నాలుగు మ్యాచ్ లు ఆడలేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నేను హ్యాట్రిక్ పడగొట్టాను. ఆ తర్వాత మ్యాచ్ లో ఐదు వికెట్లతో పాటు మొత్తం 3 మ్యాచ్ ల్లోనే 13 వికెట్లు తీశాను. ప్రతి జట్టుకు మంచి ప్రదర్శన చేయగల ఆటగాళ్లు కావాలి. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ తన ప్రదర్శనను ఎందుకు పట్టించుకోలేదు.
అవకాశం వచ్చినప్పుడే నన్ను నేను నిరూపించుకోగలను. మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీశాను. ఆ తర్వాత సెమీ ఫైనల్లో నన్ను ఆడించలేదు. భారత జట్టు ఓడిపోయింది. మంచి ప్రదర్శన చేసినా మీరు నా నుండి ఇంకా ఏమి ఆశిస్తున్నారు". అని షమీ చెప్పుకొచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన ఈ పేసర్.. సుమారు ఎనిమిది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు. 33 ఏళ్ళ ఈ సీనియర్ పేసర్ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా తెలిపాడు.
చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. షమీ బౌలింగ్ చూస్తుంటే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్ నెస్ పై కసరత్తులు చేస్తూ టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. 33 ఏళ్ళ ఈ సీనియర్ పేసర్ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా తెలిపాడు.
2019 WorldCup में 3 Match में 13 Wickets लेने के बाद मुझे DROP कर दिया गया, फिर हम Semifinal हार गए। मुझे आज भी समझ नहीं आता कि मैं क्यों Drop हुआ - Mohammad Shami #Shami #MohammedShami
— Shubhankar Mishra (@shubhankrmishra) July 19, 2024
pic.twitter.com/3XIv5Dh0lQ