వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అదరగొడుతున్నాడు. ప్రత్యర్థులకు తనదైన బంతులతో చుక్కలు చూపిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టిన షమీ.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టాప్ 5 లో ఉన్నాడు. అంతేకాదు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డును కూడా అందుకున్నాడు. ఇప్పుడు షమీ టీమిండియా జట్టుకు మోస్ట్ వాటెండ్ ప్లేయర్ అయిపోయాడు.
మహమ్మద్ షమీ ప్రదర్శనపై అతని మాజీ భార్య హసిన్ జహాన్ స్పందించింది. క్రికెట్‌కు తాను ఫ్యాన్ కాదని చెప్పిన హసిన్ జహాన్.. అలాగే క్రికెటర్లకు కూడా తానేమీ అభిమానిని కాదని చెప్పుకొచ్చింది. తానూ క్రికెట్‌ను ఎప్పుడూ చూడనంది. షమీ మంచిగా ఆడితే.. ఇండియన్ టీమ్‌లో కొనసాగుతాడని హసిన్ అభిప్రాయపడింది. అలా జరిగితే బాగా డబ్బు సంపాదించేందుకు వీలువుతుందని.. కుటుంబానికి కూడా అది మంచిదేగా అని చెప్పుకొచ్చింది . ఈ సందర్బంగా టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెప్పింది హసిన్ జహాన్.
Vo zyada kamayega to hamara bhavishya secure hoga. Team India ko best wishes de sakti hu #shami ko nahi de sakti.....
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 7, 2023
Paisa le rahi hain madam lekin beti se Milne bhi nahi deti. Crazy how some women use children as a pawn so happily pic.twitter.com/QKMlvGDbFa
మహమ్మద్ షమీ, హసిన్ జహాన్ ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. వీరిద్దరూ 2014 జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో ఓ కూతురు జన్మించింది. 2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. అయితే ఈ కేసుపై ఇటీవలే తీర్పునిచ్చిన కోల్‌కత్తా కోర్టు.. ప్రతినెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది.