ఐపీఎల్లో అర్సీబీ బౌలర్ చెత్త రికార్డు

ఐపీఎల్లో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అత్యంత చెత్తరికార్డును మూటగట్టుకున్నాడు. 15 ఏళ్లలో ఏ బౌలర్ అందుకోని చెత్త రికార్డును ఈ సీజన్లో సిరాజ్ నెలకొల్పాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్లో సిరాజ్ ఈ చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. 

 అహ్మదాబాద్లో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో  సిరాజ్ రెండు ఓవర్లు వేసి..ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఫస్ట్ ఓవర్లో 16 ఇచ్చిన సిరాజ్..రెండో ఓవర్లో 15 రన్స్ అప్పగించాడు. అయితే మొదటి ఓవర్లో యశస్వీ జైస్వాల్ రెండు సిక్సర్లు సంధించగా...రెండో ఓవర్లో బట్లర్ ఓ సిక్స్ ను బాదాడు. దీంతో ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్గా సిరాజ్ చెత్త రికార్డును సాధించాడు. ఈ సీజన్లో సిరాజ్ బౌలింగ్లో బ్యాట్సమన్ 30 సిక్సర్లు బాదడం విశేషం. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డ్ చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది.  2018 సీజన్‌లో అతను 29 సిక్సర్లు కొట్టించుకున్నాడు. ఇక 2022లో ఐపీఎల్ లో 15మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 9వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 57సగటుతో 10.08ఎకానమీతో అత్యంత చెత్తగా బౌలింగ్ వేశాడు. 

ఈ సీజన్లో ఒక్క సిరాజే కాదు..మరో ఆర్సీబీ  బౌలర్ కూడా అత్యధిక సిక్సులు సమర్పించుకున్నాడు. హసరంగా బౌలింగ్లో బ్యాట్సమన్  ఏకంగా 30 సిక్సులు దంచికొట్టారు. దీంతో అతను రెండో స్థానంలో నిలిచాడు. బ్రావో మూడో ప్లేస్లో ఉండగా...2015లో యుజ్వేంద్ర చాహల్ 28సిక్సులతో నాల్గో ప్లేస్లో కొనసాగుతున్నాడు. అయితే ఈ సీజన్లోనూ చాహల్ 27 సిక్సులు ఇచ్చుకోవడం గమనార్హం.  

మరిన్ని వార్తల కోసం..

మంకీపాక్స్ టెస్టుకు RT-PCR కిట్

రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు