మంత్రులకే అపాయిట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. కామారెడ్డికి వచ్చి ఏం చేస్తడు : షబ్బీర్ అలీ

మంత్రులకే అపాయిట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చి ఏం చేస్తారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ  ప్రశ్నించారు.  50 సంవత్సరాలు తెలంగాణ కావాలని పోరాడిన గద్దర్ లాంటి మంచి నాయకుడిని కేసీఆర్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రగతి భవన్ కు రానివ్వాలేదన్నారు.  

దళితులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని నేరవేరుస్తుందన్నషబ్బీర్ అలీ.. దళితులు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదన్నారు. ముందుగా బీఆర్ఎస్ దళితులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రకుఎందుకు వెళ్తున్నారో, రాష్ట్ర సంపదను అక్కడ ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు.  రాష్ట్రంలో ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్ట్ పేరు మార్చడం సరైంది కాదన్నారు.  

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదన్నారు షబ్బీర్ అలీ. అమిత్ షా ఖమ్మం సభలో మట్లాడినవి పచ్చి అబద్దాలని చెప్పారు.  బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అలైబలై చేసుకోని ప్రజలను మోసం చేస్తున్నాయని  ఆరోపించారు.  తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రజలకి కేసీఆర్ చేసింది ఏమీ లేదని విమర్శి్ంచారు.