దమ్ముంటే కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి : షబ్బీర్ అలీ

సీఎం కేసీఆర్ కు దమ్ముంటే కామారెడ్డిలో అడుగుపెట్టాలన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.  తనపై చేస్తున్న దుష్పరచారాన్ని ఆపాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు.  కేసీఆర్ పై పోటీచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.  నియోజకవర్గం మారేది లేదన్నారు.  రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుతో కామారెడ్డిలో కేసీఆర్  గెలవాలనుకుంటున్నాడని ఆరోపించారు. కామారెడ్డి కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు అలీ.  కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తు్ండటంతో షబ్బీర్ ఆలీ బరిలోకి దిగేందుకు  విముఖత చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.  

Also Read :- వెయ్యేండ్ల నాటి భువనగిరి కోట ..ఓసారి చూసోద్దామా