ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజాం పాలనపై మాట్లాడేందుకు కేసీఆర్ ​భయపడ్డారు
నల్ల బ్యాడ్జీలతో బీజేపీ నిరసన

బాన్సువాడ, పిట్లం, వెలుగు: సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా ఆదివారం బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ విమోచన దినాన్ని పక్కదారి పట్టించినందుకు, రజాకార్ల పాలన గురించి మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ భయపడ్డందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేక పోరాటాల ఫలితమే తెలంగాణ విమోచనమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, కొత్తకొండ భాస్కర్,  మోహన్ రెడ్డి, తృప్తి ప్రసాద్, పట్టణ కార్యదర్శి గంగారెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, కిశోర్ మోర్చా జిల్లా నాయకులు పోల్కం గోపాల్ , ఇతర లీడర్లు పాల్గొన్నారు.  పిట్లం, బిచ్కుందలో బీజేపీ, బీజేవైం నాయకులు  నిరసన తెలిపారు. పార్టీ జిల్లా సెక్రటరీ  రాము, ఓబీసీ జిల్లా వైస్​ప్రెసిడెంట్​అశోక్​రాజ్​, బీజేవైఎం నాయకులు శెట్పల్లి విష్ణు, అభినయ్​రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్​రెడ్డి, రమేశ్​, ప్రకాశ్, హన్మాండ్లు, లింగురాం, రఘు పాల్గొన్నారు.

ఆర్మూర్ లో.. 

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​లో చాకలి ఐలమ్మ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.  కార్యక్రమంలో బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారంపల్లి గంగాధర్, కంచెట్టి గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శులు రాజు, విజయ్, రాజు, రాజేందర్, కృష్ణ గౌడ్, నరేశ్​చారి పాల్గొన్నారు.

కామారెడ్డిలో బీజేపీ నిరసన దీక్ష

కామారెడ్డి, వెలుగు:  నిజాం పాలనలో మారణ హోమం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార పేర్కొన్నారు.  ఓటుబ్యాంక్​ రాజకీయాల కోసమే  నిజాం నిరంకుశ పాలనపై  సీఎం కేసీఆర్​ మాట్లాడలేదని విమర్శించారు.  సీఎం వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో అంబేద్కర్​విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి
స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను  కాపాడాల్సిన అవసరం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తోందని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.  తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో    సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకారులు, కవులు, ఆయా రంగాల్లో  కృషి చేసిన వారిని సన్మానించారు. చీఫ్​గెస్ట్​గా హాజరైన స్పీకర్​ మాట్లాడుతూ..   తెలంగాణకు దిక్సూచి స్టూడుంట్సేనన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు.  మంచి చదువుతో పాటు,  పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.  భూమి లేని గిరిజనులకు త్వరలో  గిరిజన బంధు తీసుకొస్తున్నారన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్​కు సంబంధించిన జీవో ఇస్తామని సీఎం ప్రకటించినట్లు గుర్తుచేశారు.  8 ఏండ్లలో తెలంగాణ ఎన్నో అద్భుత ఫలితాలు సాధించినట్లు తెలిపారు.  ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ మాట్లాడుతూ..  వచ్చే తరానికి తెలంగాణ చరిత్రను తెలియజేసేలా జాతీయ సమైక్యతా ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహిస్తున్నామన్నారు.  కలెక్టర్​జితేశ్​ వి.పాటిల్​, ఎమ్మెల్యే హన్మంతుషిండే, స్టేట్​ ఉర్దూ అకాడమీ చైర్మన్​ముజీబుద్ధీన్​, జిల్లా లైబ్రరీ చైర్మన్​ పున్న రాజేశ్వర్​,  మున్సిపల్​ చైర్​పర్సన్​ జాహ్నవి, జడ్పీ వైస్​ చైర్మన్​ ప్రేమ్​కుమార్, అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​, అసిస్టెంట్​ కలెక్టర్​ శివేంద్ర ప్రతాప్​ పాల్గొన్నారు.

వాగులో పడి యువకుడి మృతి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: ప్రమాదవశాత్తు వాగులో పడి మధ్యప్రదేశ్​కు చెందిన యువకుడు చనిపోయాడు. బాలాఘాట్ జిల్లా మోహర గ్రామానికి చెందిన ఆకాశ్ టాగూర్ (27) సిటీలోని ఓ అపార్ట్​మెంట్ ​నిర్మాణంలో కూలి పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శనివారం విశ్వకర్మకు పూజ చేసిన టాగూర్​.. ఆదివారం వెంచర్ పక్కన ఉన్న వాగులో కలశం వదిలేందుకు వెళ్లాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు వాగులో పడి మునిగి ఊపిరి ఆడక చనిపోయాడు. బంధువు తరుణ్ పార్ది ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రాలీ ఢీకొని ఒకరు మృతి

ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండల కేంద్రంలో చెరువుతండా సమీపంలో గూడ్స్​ట్రాలీ, బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు చనిపోయినట్లు ఎస్ఐ వంశీకృష్ణరెడ్డి తెలిపారు. ధర్పల్లికి చెందిన ఎలాల తాటిచెట్టుకాడొల్ల రాజేశ్వర్​రెడ్డి(58)  బైక్​పై ఇందల్వాయి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న గూడ్స్​ట్రాలీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజేశ్వర్​రెడ్డిని హాస్పిటల్​కు తరలిస్తుండగా చనిపోయాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అందరికీ ఉచిత వైద్యం మోడీ లక్ష్యం
బీజేపీ ఆధ్వర్యంలో హెల్త్​ క్యాంపులు

కామారెడ్డి, వెలుగు: అందరికీ ఉచిత వైద్యం అందించటమే ప్రధాని మోడీ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణతార పేర్కొన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో  ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించారు.  నియోజకవర్గ ఇన్​చార్జి వెంకటరమణరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్​, విపుల్​ పాల్గొన్నారు.  

నిజామాబాద్ టౌన్, వెలుగు: ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంజీవయ్య కాలనీలోని గౌడ సంఘంలో ఉచిత మెగా హెల్త్​క్యాంపు నిర్వహించారు. డాక్టర్లు ధన్పాల్ వినయ్, గణేశ్, శబరినత్,  జగన్ కుమార్ భానుప్రియ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ప్రవల్లిక, బీజేపీ లీడర్లు పుతన్కర్, లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, కిశోర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నందిపేట, వెలుగు: నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్​చైర్మన్​ కంచెట్టి గంగాధర్​, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, పార్టీ మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, నాగ తారక్​ పాల్గొన్నారు. 

ఆర్మూర్​లో..

ఆర్మూర్, వెలుగు:  ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ఆర్మూర్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రేష్ఠ్ భారత్-ఆరోగ్య్ భారత్ లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటి డాక్టర్​జంగారెడ్డి టెస్ట్​లు చేసి మందులు అందజేశారు. 


హామీలిచ్చి మరిచిపోవటం కేసీఆర్​కు అలవాటే
మాజీ మంత్రి షబ్బీర్ ​అలీ

కామారెడ్డి,  వెలుగు: హామీలివ్వటం, మరిచిపోవటం సీఎం కేసీఆర్​కు అలవాటేనని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు.  కాంగ్రెస్​ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఆదివారం షబ్బీర్​అలీ కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, తిమ్మక్​పల్లి, లింగాపూర్​ గ్రామాల్లో  పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములు లాక్కొని ఇప్పుడు కేసీఆర్​గిరిజన, ఆదివాసుల భవనాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారన్నారు.  దళితబంధు టీఆర్ఎస్​ కార్యకర్తలకు తప్ప ఎవరికీ రావడం లేదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలనలో పేదల బతుకులు దుర్భరంగా మారాయని విమర్శించారు.  డీసీసీ అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​రావు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి,  లీడర్లు ఇంద్రకరణ్​రెడ్డి, ఆనంద్​రావు,  కిషన్​రావు,  రాజు,  ముకుందం, శ్రీనివాస్​ పాల్గొన్నారు.

ధన్ పాల్ కు టికెట్ కోసం  కార్యకర్తల పాదయాత్ర

నిజామాబాద్ టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రావడంతో పాటు ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని కోరుతూ నగరానికి చెందిన పలువురు బీజేపీ లీడర్లు, అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ లీడర్​గట్ల గంగాధర్ నేతృత్వంలో కార్యకర్తలు నాగారం నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అక్కడ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

కామారెడ్డి, వెలుగు: అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం చెల్లించాలని  భారతీయ కిసాన్​ సంఘ్​ జాతీయ కార్యవర్గ మెంబర్​ నానా అక్రే  డిమాండ్​ చేశారు.  సంఘం జిల్లా మీటింగ్​ఆదివారం కామారెడ్డిలోని  శిశు మందిర్​లో జరిగింది.   రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతినిధులు చర్చించారు.  నానా అక్రే మాట్లాడుతూ  కామారెడ్డి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం 22వ  ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలన్నారు.  జాతీయ కార్యదర్శి  కొండెల సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్​రెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్​ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

లింగంపేట,వెలుగు: రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్​ కల్పిస్తానని, వారికి గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆదివారం లింగంపేటలోని అంబేద్కర్​ కూడలిలో  సీఎం కేసీఆర్​, ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఫ్లెక్సీలకు గిరిజన లీడర్లు క్షీరాభిషేకం చేశారు. బంజారాసేవాసంఘం మండల నాయకుడు గన్నూనాయక్​, లీడర్లు సక్రూనాయక్, విఠల్, పీర్​సింగ్, పరుశురాం, చందర్, ఎంపీపీ గరీబున్నిసా, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు రమేశ్​, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, టౌన్​అధ్యక్షుడు సాయిరాం పాల్గొన్నారు.

గ్రామాల్లో ఊర పండుగ

డిచ్​పల్లి/ఇందల్వాయి, వెలుగు: డిచ్​పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో పాత గ్రామ దేవతల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. శనివారం అర్ధరాత్రి నుంచే గ్రామాల్లో పండుగ షురూ అయ్యింది. గ్రామ దేవతల వద్ద రంగురంగుల పట్నాలు పరిచి మేకలను బలి ఇచ్చారు. డప్పు చప్పుల్లతో, పోతరాజుల వీరంగాలతో గ్రామాలు మారుమోగాయి.