భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్ యూసుఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు బంజారాహిల్స్ లోని మస్జిద్ ఎ బఖీలో జొహర్ ప్రార్థనల తరువాత నమాజ్ ఎ జనాజా అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.