- ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి
ఖైరతాబాద్, వెలుగు: -ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైడ్రాకు వ్యతిరేకంగా పాతబస్తీ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆలిండియా ముస్లిం రిజర్వేషన్‌పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ఇస్లాముద్దీన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన వక్ఫ్‌బోర్డు, దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునేందుకు హైడ్రాకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసదుద్దీన్మాటలను పాతబస్తీ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఒవైసీ బ్రదర్స్ఆటలు ఇక సాగవన్నారు.
జీహెచ్ఎంసీ ఆఫీస్ఎఫ్టీఎల్పరిధిలో ఉందంటున్న అసదుద్దీన్.. స్కూళ్ల పేరుతో చేసిన కబ్జాలాపై సమాధానం చెప్పాలన్నారు. -హైడ్రాతో కబ్జాలకు పాల్పడిన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. 70 ఏండ్లలో ఏ సీఎం చేయలేని సాహసం రేవంత్‌రెడ్డి చేశారని చెప్పారు. హోటళ్లలో రైడ్లు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం నిర్ణయాలు అభినందనీయమన్నారు. సమావేశంలో ఆలిండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఖలీల్, ఎం.కె.నహిముద్దీన్, అహ్మద్, ఇస్మాయిల్, జయరాజ్తదితరులు పాల్గొని మాట్లాడారు.