40 ఏండ్లు మార్చురీ డ్యూటీ..50 వేల పోస్టుమార్టంలో భాగం

40 ఏండ్లు మార్చురీ డ్యూటీ..50 వేల పోస్టుమార్టంలో భాగం
  •     ఉద్యోగ విరమణ చేసిన మార్చురీ అసిస్టెంట్​కు సన్మానం

పద్మారావునగర్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగి తన పదవీ కాలంలో అందించిన సేవలు, వృత్తి నిబద్ధతే గుర్తింపును ఇస్తాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎం.రాజారావు చెప్పారు. గాంధీ హాస్పిటల్ లో 40 ఏండ్లు మార్చురీ అసిస్టెంట్ గా పనిచేసిన మహ్మద్ సలీమ్​శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈసందర్భంగా మెడికల్ కాలేజీలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

దాదాపు 40 ఏండ్లపాటు మార్చురీలో సేవలు అందించడం గొప్ప విషయమని డా.రాజారావు ప్రశంసించారు. 50 వేలకు పైగా డెడ్ బాడీల పోస్టు మార్టంలో సలీమ్ పాత్ర ఉందని ఫోరెన్సిక్​ మెడిసన్​హెచ్ఓడీ ప్రొఫెసర్​కృపాల్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా సలీమ్​ను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.