రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి మరో స్టార్ బౌలర్ దూరం

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి మరో స్టార్ బౌలర్ దూరం

ఐపీఎల్ ముందు రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024కు దూరమయ్యాడు. మరో వైపు గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ క్యాష్ లీగ్ టోర్నీలో ఆడటం లేదు. తాజాగా ఈ విషయాన్ని బీసీసీఐ వైద్య బృందం మంగళవారం (మార్చి 11) ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ ఇద్దరు పేసర్లు గాయాలతో ఈ ఏడాది ప్రారంభంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే.  

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ ఫిబ్రవరి 23న తన ఎడమ ప్రాక్సిమల్ క్వాడ్రిస్ప్స్ స్నాయువుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంకా కోలుకొని కారణంగా ఈ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నాడు. ప్రసిద్ కృష్ణ ప్రస్తుతం BCCI వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు . త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ సంపాదించేందుకు రెడీగా ఉన్నాడు. IPL 2024లో అతను ఆడటం లేదు. అని బోర్డు తెలిపింది. ప్రసిద్ కృష్ణ లేకపోవడంతో రాజస్థా రాయల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. 

షమీ విషయానికి వస్తే ఎడమ చీలమండ గాయంతో స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ షమీ పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. జనవరి చివరి వారంలో షమీ లండన్‌‌‌‌ వెళ్లి చీలమండకు ప్రత్యేకమైన ఇంజెక్షన్‌‌‌‌ తీసుకున్నాడు. మూడు వారాల తర్వాత లైట్‌‌‌‌గా రన్నింగ్‌‌‌‌ మొదలుపెట్టాడు. కానీ ఇంజెక్షన్‌‌‌‌ పని చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్పీడ్‌స్టర్.. కోలుకోవడానికి  ఎక్కువ సమయం అవసరమని వైద్యులు సూచించారు.